భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 29/03/2020 21:56 IST

భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు

దిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కి చేరింది. వీరిలో 96 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.

> బిహార్‌లో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15కి చేరింది. 

> కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 203కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 22 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. వీరిలో 35 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 8 మంది మరణించారు.

> ఉత్తరాఖండ్‌లో 47 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 7కి చేరింది. వీరిలో మగ్గురికి పరీక్షల్లో నెగటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు.

> కర్ణాటకలో కొత్తగా ఏడుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83కి చేరింది. వీరిలో ఐదుగురు కోలుకోగా ముగ్గురు మృతిచెందారు. 

>  గుజరాత్‌లో ఆదివారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 58కి చేరింది. 

> తమిళనాడులో 8 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.విజయ్‌భాస్కర్ తెలిపారు. దీంతో కరోనా కేసు సంఖ్య 42కి చేరింది. వీరిలో ఇద్దరిని కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు.  

> భారత్‌లో తొలి కరోనా కేసు నమోదయిన కేరళలో తాజాగా 20 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. వీరిలో 18 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా, మరో ఇద్దరు కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 202కి చేరింది.

> గోవాలో రెండు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు విదేశాల నుంచి రాగా, మరొకరు కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల సోకినట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. దీంతో గోవాలో కరోనా కేసుల సంఖ్య 5కి చేరింది. 

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72కి చేరింది. 

> పశ్చిమబెంగాల్‌లో ఆదివారం మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17కి చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని