దేశంలో 1834కు చేరిన కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 02/04/2020 01:33 IST

దేశంలో 1834కు చేరిన కరోనా కేసులు

దిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాణాంతక సూక్ష్మజీవి 203 దేశాలకు విస్తరించింది. ఇక భారత్‌లో రోజు రోజుకూ దీని వ్యాప్తి ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1834 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం 1649 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 143 మంది డిశ్చార్చి అయ్యారు. మృతుల సంఖ్య 41 కి చేరింది. 

ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 9,10,323 మంది దీని బారిన పడ్డారు. 45,496 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాధి నుంచి 1,90,901 మంది రోగులు కోలుకున్నారు. ఇక కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన ఇటలీలో ఒక్కరోజులోనే 727, స్పెయిన్‌లో 589 మంది కన్నుమూశారు. ఇక యూకేలో ఒక్కరోజులోనే 563 మంది మృతిచెందారు. ఇక  ఇప్పటివరకు అమెరికాలో 4,482 మంది, బ్రెజిల్‌లో 206 మంది, ఇటలీలలో 13,155 మంది, స్పెయిన్‌లో 9,053 మంది, ఫ్రాన్స్‌లో 3,523 మంది, యూకేలో 3,523 మంది, నెదర్లాండ్‌లో 1173 మంది, జర్మనీలో 858 మంది, బెల్జియంలో 828 మంది, స్విట్జర్లాండ్‌లో 461 మంది, స్వీడన్లో 239 మంది, పోర్చుగల్‌లో 187 మంది, చైనాలో 3,312 మంది, ఇరాన్‌లో 2,898 మంది, టర్కీలో 214 మంది, దక్షిణకొరియాలో 165 మంది, ఇండోనేషియాలో 136 మంది చనిపోయారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని