కుక్కలు, పిల్లులు తినడంపై నిషేధం

తాజా వార్తలు

Published : 03/04/2020 00:51 IST

కుక్కలు, పిల్లులు తినడంపై నిషేధం

నిర్ణయం తీసుకున్న తొలి చైనా నగరంగా షెన్‌జెన్‌

షెన్‌జెన్‌ (చైనా): ‘‘ఏది పడితే అది తింటారు. మీ వల్ల ఇవాళ ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది. అయినా ఆ తిండేంటిరా బాబూ’’ ఇదీ.. కొవిడ్‌-19 విజృంభిస్తున్న వేళ చైనా ఆహారపు అలవాట్లు గురించి వినిపిస్తున్న కామెంట్‌. కరోనా మహమ్మారి వెలుగుచూసిందీ ఎక్కువగా మాంసం విక్రయించే వుహాన్‌ నగరంలోనే. దీంతో కొన్నాళ్లు ఆ దుకాణాలను మూసివేసినా మళ్లీ వాటి విక్రయాలు ఊపందుకున్నాయి. అయితే, అదే చైనాలోని షెన్‌జెన్‌ నగరం మాత్రం కళ్లు తెరిచింది. కుక్కలు, పిల్లులు విక్రయాలతో పాటు తినడంపై నిషేధం విధించింది.

మే 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని షెన్‌జెన్‌ సిటీ ప్రభుత్వం పేర్కొంది. కుక్కలూ పిల్లులూ మిగిలిన జంతువులతో పోలిస్తే మనిషితో మంచి సంబంధాలు కలిగి ఉంటాయిని, అందుకే వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే చైనా క్రూర మృగాల మాంసం విక్రయాలపై ఫిబ్రవరిలో నిషేధం విధించగా.. దాన్ని కుక్క, పిల్లులకు కూడా షెన్‌జెన్‌ నగరం వర్తింపజేసింది.

షెన్‌జెన్‌ తీసుకున్న నిర్ణయంపై జంతు సంరక్షణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనాతో షెన్‌జెన్‌ సిటీ మేల్కొందని, మరో ఉపద్రవం ముంచుకురాకుండా ముందు జాగ్రత్త తీసుకుందని అంతర్జాతీయ హ్యూమన్‌ సొసైటీ (హెచ్‌ఎస్‌ఐ)కి చెందిన వన్య ప్రాణి విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ థెరిసా ఎం.టెల్కీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇతర ప్రభుత్వాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆసియా మొత్తమ్మీద ఏటా 3 కోట్ల శునకాలను మాంసం కోసం వధిస్తారని హెచ్‌ఎస్‌ఐ తెలిపింది. హాంకాంగ్‌, తైవాన్‌లో వీటి వినియోగం ఎక్కువ.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని