వైద్య సిబ్బంది రక్షణకు ‘రోబో’

తాజా వార్తలు

Published : 09/04/2020 22:47 IST

వైద్య సిబ్బంది రక్షణకు ‘రోబో’

కరోనా రోగులకు సేవలందించేందుకు ఏర్పాటు 

రాయ్‌పూర్‌: కరోనా బాధితులకు సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిని రక్షించడానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రోబోను తయారు చేశాడు. కరోనా రోగులకు వైద్యం చేస్తూ ఆ మహమ్మారి బారిన పడే వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో రోగులకు సపర్యలు చేసేందుకు తన స్నేహితులతో కలిసి రోబోను తయారు చేసినట్లు బీటెక్‌ విద్యార్థి యోగేశ్‌ సాహూ చెప్పాడు. ఐసోలేషన్‌ వార్డుల్లోని రోగులకు ఆహారం, ఔషధాలు అందించేందుకు వైద్య సిబ్బంది వీటిని ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ రోబో ఇంటర్‌నెట్‌ ఆధారంగా పని చేస్తోందని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి చేసి వైద్యులకు అందిస్తానని తెలిపారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని