హైటెక్‌ ఐసోలేషన్‌..రోబో సాయం

తాజా వార్తలు

Published : 14/04/2020 22:32 IST

హైటెక్‌ ఐసోలేషన్‌..రోబో సాయం

రాంచీ: ఇప్పుడు ఏ నోట విన్నా కరోనాయే. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎదుటి వారిని ఆప్యాయంగా హత్తు కోవాలన్నా అడ్డు తగులుతోంది. కరోనా బారిన పడిన వారికి సాయమందించేందుకు సొంత కుటుంబ సభ్యులనే దరి చేరకుండా చేస్తోంది ఈ మహమ్మారి. వైద్య నిపుణులు సైతం కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ సోకిన వారికి వైద్య మందించేందుకు ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌బమ్‌ జిల్లా అధికారులు సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకకుండా వారి స్థానంలో రోబోలను వినియోగిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు రోబోలే బాధితుల దగ్గరికి వెళ్లి వైద్యం, ఆహారం అందించేలా వీటిని తయారు చేశారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి సహాయ కమిషనర్‌ ఆదిత్య రంజన్‌ వెల్లడించారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయని మీడియాకు తెలిపారు. వరుసగా 20, 30 పడకల సామర్థ్యంలో ఏఎన్‌ఎం స్కిల్ సెంటర్‌, చక్రధర్‌పూర్‌ రైల్వే ఆస్పత్రుల్లో ‘హైటెక్‌ ఐసోలేషన్‌’ వార్డులను ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ వైద్య సిబ్బంది స్థానంలో రోబోలే సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని