కరోనా వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా

తాజా వార్తలు

Published : 15/04/2020 16:04 IST

కరోనా వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా

బీజింగ్‌/వుహాన్‌: కరోనా వైరస్‌ కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో వుహాన్‌లో పది రోజుల్లో నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా బుధవారం మూసేసింది. పని పూర్తవ్వడంతో వైద్యులంతా తిరిగి వెళ్లిపోయారని అధికార పత్రిక షిన్‌హువా తెలిపింది.

కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌లోనే పురుడు పోసుకుందన్న సంగతి అందరికీ తెలిసిందే. రోజుల్లోనే వందల నుంచి వేల మందికి వైరస్‌ సోకడంతో ప్రభుత్వం ఫిబ్రవరిలో కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రికి సిద్ధం చేసింది. వెంటనే రెండో వెయ్యి పడకల ఆస్పత్రినీ నిర్మించింది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కోసం 14 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది.

రోగులకు యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు వేలాది మంది వైద్యసిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. 42వేలకు పైగా సిబ్బంది హుబెయ్‌కు చేరుకున్నారు. జనవరి 23 నుంచి ప్రభుత్వం కఠోరంగా శ్రమించింది. ఏప్రిల్‌ 8న లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. సేవలు అందించే క్రమంలో 3వేల మందికి పైగా వైద్యసిబ్బందికి వైరస్‌ సోకింది. హుబెయ్‌లో ప్రస్తుతం కరోనా కొత్త కేసులేమీ నమోదు కాకపోవడంతో ఆ ఆస్పత్రిని మూసేసింది.

లక్షణాలు కనిపించకుండా కరోనా కేసులు నమోదవ్వడం చైనాను కలవరపెడుతోంది. మంగళవారం ఇలాంటి 32 కేసులు నమోదయ్యాయని హుబెయ్‌ తెలిపింది. ఇక రష్యాతో ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వైరస్‌ స్థానిక వ్యాప్తి జరుగుతోంది. ఇక్కడి సూయిఫెన్హ్‌ నగరం వుహాన్‌ మాదిరిగా మరో హాట్‌స్పాట్‌ కేంద్రంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని