దేశాల పరస్పర సహకారం అవసరం

తాజా వార్తలు

Published : 15/04/2020 22:45 IST

దేశాల పరస్పర సహకారం అవసరం

 


హైదరాబాద్‌ : కరోనా నియంత్రణకు అత్యవసరమయ్యే వైద్య సంబంధిత వస్తువుల ఎగుమతులపై విధించిన నిషేధాలను ఎత్తివేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కరోనాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం అన్ని దేశాలకు సర్జికల్‌ మాస్కులు, వెంటిలేటర్లు తదితర వైద్య పరికరాల అవసరం బారీగా ఉందని తెలిపింది. వీటి ఎగుమతులపై నిషేధాలకు ప్రస్తుతం సరైన సమయం కాదని ఐఎమ్‌ఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు. ప్రయాణాలు, ఉత్పాదక కార్యకలాపాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసుకు ఆటంకం ఏర్పడి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రపంచీకరణను దృష్టిలో ఉంచుకొని దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని