భారత్‌కు మేం గట్టి మద్దతు ఇస్తాం: ఐఎంఎఫ్‌

తాజా వార్తలు

Updated : 16/04/2020 14:54 IST

భారత్‌కు మేం గట్టి మద్దతు ఇస్తాం: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిపై భారత విధానపరమైన స్పందన, ఉద్దీపన పథకానికి తాము గట్టి మద్దతు ప్రకటిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు విధానాలు బాగున్నాయని ఐఎంఎఫ్‌ ఆసియా, పసిఫిక్‌ విభాగం డైరెక్టర్‌ చాంగ్‌ యాంగ్‌ రీ అన్నారు.

‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారత్‌ లాక్‌డౌన్‌ విధించింది. పేదలు, మధ్యతరగతి వర్గం కోసం ఉద్దీపన పథకం ప్రకటించింది. కరోనా మహమ్మారిపై భారత్‌ విధాన పరమైన స్పందనకు మేం గట్టి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు తీసుకుంటున్న లిక్విడిటీ చర్యలు బాగున్నాయి. మధ్యకాలిక వృద్ధి సాధించేందుకు భారత్‌ సమగ్ర, సమ్మిళిత సంస్కరణలు చేపట్టాలి. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరగాలి. వైద్య పరికరాలు పెంచుకోవాలి. సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాలి’ అని రీ అన్నారు.

‘కొవిడ్‌-19 ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చోదకంగా పనిచేసే ఆర్థిక చర్యలు గణనీయంగా చేపట్టాలి. వైరస్‌ కట్టడి కాగానే రికవరీ మొదలవుతుంది. డిమాండ్‌ వైపు నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మందగమనం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది. పర్యాటకం సహా కొన్ని రంగాలు వెంటనే  కోలుకోవడం కష్టం. సరఫరా వ్యవస్థ, తయారీ, నిర్మాణ రంగాలపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉంది. తగినంత లిక్విడిటీ లేకపోవడంతో పెట్టుబడులు తగ్గొచ్చు. వైరస్‌ మరింతగా విజృంభిస్తే చాలామంది చనిపోతారు. వైద్య వ్యవస్థపై భారం పెరుగుతుంది. నిరుద్యోగం ప్రబలుతుంది. మధ్యకాలిక వృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటే ఉద్యోగాలు సృష్టించొచ్చు’ అని రీ వెల్లడించారు.

చదవండి: చైనా కిట్లు.. నాణ్యత డొల్ల

చదవండి: ట్రంప్‌ తీసేస్తే మేం కళ్లకు అద్దుకుంటాం



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని