ఈ పండగకు ఇంటికి రావడం నిషేధం!

తాజా వార్తలు

Published : 21/04/2020 20:14 IST

ఈ పండగకు ఇంటికి రావడం నిషేధం!

జకర్తా: కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఇండోనేసియా కఠిన నిర్ణయం తీసుకుంది. రంజాన్‌ సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు తిరిగి ఇంటికొచ్చి పండగ జరపుకోవడాన్ని నిషేధించింది. కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశంలో కనీసం పది లక్షల మంది వైరస్‌ బారిన పడతారని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు జనాభా ఉన్న దేశం ఇండోనేసియా. రంజాన్‌ పర్వదినాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకొంటారు. ఏటా లక్షల మంది కుటుంబీకులతో పండగ జరుపుకొనేందుకు రైళ్లు, బస్సులు, కార్లు, విమానాల్లో ప్రయాణిస్తారు. గతేడాది సెలవుల్లో సన్నిహితులను కలిసేందుకు 3.3 కోట్ల మంది ఇండోనేసియన్లు పెద్ద నగరాలకు తరలివెళ్లారు.

సెలవుల్లో దాదాపు 24 శాతం మంది ఇళ్లకు వెళ్లే అవకాశముందని ప్రభుత్వ సర్వేల్లో తేలిందని అధ్యక్షుడు విడోడో అన్నారు. ప్రయాణాలు చేయడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని పేర్కొన్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.

ప్రస్తుత నిషేధంతో దాదాపు 60 లక్షల మంది సివిల్‌ సర్వెంట్లు, సైనికులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండనున్నారు. సోమవారం నాటికి ఇండోనేసియాలో 6,760 మందికి కరోనా వైరస్‌ సోకగా 590 మంది మృతిచెందారు.

చదవండి: మా వైద్యుల్ని కాపాడుకొనేందుకు కరోనా వ్యాక్సిన్‌ ఇస్తాం

చదవండి: ప్రపంచమంతా ఒక బాధ.. పాక్‌ది మరో బాధ!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని