కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

తాజా వార్తలు

Updated : 25/04/2020 09:12 IST

కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

శ్రీనగర్‌: ఓవైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాక్‌ ఉగ్రవాదులు మాత్రం దుశ్చర్యలకు ఏమాత్రం స్వస్తి పలకడం లేదు. శనివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారితో సంబంధం ఉన్న మరో వ్యక్తి హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవంతిపొర సెక్టార్‌లోని గోరిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ వేకువజామున భద్రతా బలగాలతో కలిసి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అక్కడే నక్కి ఉన్న ముష్కరులు వీరి కదలికల్ని పసిగట్టి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు సహా వారితో సంబంధం ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే హతమయ్యాడు. మరి కొందరు ముష్కరులు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని