ఔరంగాబాద్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

తాజా వార్తలు

Updated : 08/05/2020 16:48 IST

ఔరంగాబాద్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ  సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. రైలు పట్టాలపై నిద్రపోతున్న వలస కూలీలపై శుక్రవారం తెల్లవారుజామున  గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 16మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పెను విషాదం రేపింది. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వీరంతా మహారాష్ట్రలోని జాల్నా నుంచి మధ్యప్రదేశ్‌కు రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరగా మార్గమధ్యంలో విశ్రాంతికోసం నిద్రించిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

అయితే, ఆ సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేశారు? రైల్వే నిబంధనల్ని అతిక్రమించే వాళ్లను ట్రాక్‌లకు దూరంగా ఉంచడంతో పాటు ఏదైనా ఘటన జరిగినప్పుడు సమీప స్టేషన్లను అప్రమత్తం చేశారా? లేదా తదితర అంశాలపై దర్యాప్తు చేయనున్నారు. దక్షిణ మధ్య సర్కిల్‌ రైల్వే భద్రతా కమిషనర్‌ రామ్‌ కృపాల్‌తో ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు రైల్వేశాఖ ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదు.

ఇదీ చదవండి

కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్‌రైలు: 16 మంది మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని