భవిష్యత్తులో విమాన ప్రయాణం ఇలా!

తాజా వార్తలు

Published : 12/05/2020 01:17 IST

భవిష్యత్తులో విమాన ప్రయాణం ఇలా!

దిల్లీ: కరోనా వైరస్ కల్లోలం కారణంగా భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు,.. వంటివి మన జీవితంలో భాగమయ్యాయి. దీనికి సంబంధించి విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి షేర్‌ చేసిన చిత్రం పరిస్థితులకు అద్దం పడుతుంది. ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొచ్చిన ఓ విమానంలోని చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులందరు ఫేస్‌ షీల్డులు ధరించడంతో చూడటానికి సైంటిఫిక్‌ చిత్రంలోని దృశ్యంలా కనిపించింది. 

‘కాలాలు మారుతున్నాయి. ఇది సైన్స్‌ ఫిక్షన్ చిత్రంలోని దృశ్యం కాదు. సింగపూర్ నుంచి ముంబయి వచ్చిన విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఇది. నివారణ చర్యలు సరి కొత్తగా ఉన్నాయి. ’ అని‌ ట్వీట్ చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్’, ‘సముద్ర సేతు’ కింద ప్రత్యేక విమానాలు, ఓడలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని