లాక్‌డౌన్‌ కొనసాగింపా.. సడలింపా?

తాజా వార్తలు

Published : 11/05/2020 15:16 IST

లాక్‌డౌన్‌ కొనసాగింపా.. సడలింపా?

కరోనా కట్టడిపై ఎలా ముందుకెళ్దాం?
సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ఈ విశ్వ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ -3 మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 4200 కేసులు నమోదవ్వడంతో దీన్ని కట్టడి చేసే వ్యూహంపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఐదోసారి జరుగుతున్న ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌  రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు తొలి సెషన్‌; సాయంత్రం 6గంటల నుంచి రెండో సెషన్‌ జరగనుంది.

గతంలో నాలుగు సార్లు జరిగిన సమావేశంలో కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కిన నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో అందరు సీఎంలకూ మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అయితే, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? సడలిస్తారా? అని దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల అంశాలను పలు రాష్ట్రాలు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా,  ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు, ఎంఎస్‌ఎంఈ సహా పారిశ్రామిక రాయితీల అంశాలను ప్రధాని వద్ద లేవనెత్తే అవకాశం ఉంది.  దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేసుల తీవ్రతను బట్టి జోన్ల వారీగా కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని