వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు‌ 

తాజా వార్తలు

Published : 13/05/2020 23:49 IST

వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు‌ 

దాతృత్వం చాటుకున్న ఖతార్‌ ఎయిర్‌వేస్‌

దోహా: ప్రముఖ విమాయాన సంస్థ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కరోనాపై పోరులో ముందువరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి లక్ష తిరుగు ప్రయాణ విమాన టికెట్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు ఆరోగ్య సిబ్బంది తమ వెబ్‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మే 18 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమేనని తెలిపింది. ముందుగా వివరాలను నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అన్ని దేశాలకు చెందిన ఆరోగ్య సిబ్బందికి ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. 

‘‘కరోనా మహమ్మారి నియంత్రణకు ముందుండి అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కృతజ్ఞతలు తెలుపుతోంది. వారి నిర్విరామ కృషి వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారు. వారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు. అందుకే మా వంతుగా వారికి తిరుగు ప్రయాణ టిక్కెట్లను అందివ్వాలని నిర్ణయించాం. విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ఏ ప్రదేశానికి వెళ్లినా వారి తిరుగు ప్రయాణ టికెట్టును ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వారికి ఉచితంగా అందిస్తాం’’ అని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గ్రూప్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ అక్బర్‌ అల్‌ బకర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సొంత వారికి దూరంగా వేరు వేరు ప్రదేశాల్లో చిక్కుకుపోయారని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వారందరినీ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు విమాన సర్వీసులు నడపటంపై త్వరలో విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయని అల్‌ బకర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని