ఆయుర్వేదం.. వారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ 

తాజా వార్తలు

Updated : 14/05/2020 15:47 IST

ఆయుర్వేదం.. వారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ 

కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి వెల్లడి

దిల్లీ: విశ్వ మహమ్మారి కరోనాను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక వ్యవస్థలను పతనం చేస్తున్న ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై ఆయుర్వేద ఔషధాల్ని ప్రయోగించేందుకు భారత్‌ సిద్ధమైంది. నాలుగు ఆయుర్వేద ఔషధాలను కరోనా రోగులపై ప్రయోగించనున్నట్టు ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద్‌ వై నాయక్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

భారత్‌లో ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి సంప్రదాయ ఔషధ పద్ధతులు ఉండగా.. వీటన్నింటినీ కలిపి ఆయుష్‌ మంత్రిత్వశాఖగా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా రోగులపై ప్రయోగించేందుకు నాలుగు ఆయుర్వేద ఔషధాల ప్రయోగంపై ఆయుష్‌ మంత్రిత్వశాఖ, సీఎస్‌ఐఆర్‌ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఒక వారంలోగా క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలవుతాయని ప్రకటించారు. మన సంప్రదాయ ఔషధ వ్యవస్థ ఈ మహమ్మారిని అధిగమించే ఓ మార్గాన్ని చూపుతుందని తాను విశ్వసిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 

కనీవినీ ఎరుగని రీతిలో విజృంభిస్తున్న ఈ మాయదారి రోగాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి
కరోనా: అశ్వగంధతో  క్లినికల్‌ ట్రయల్స్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని