వాళ్లకి కరోనా ఓ ఆదాయ వనరు!

తాజా వార్తలు

Published : 01/06/2020 01:02 IST

వాళ్లకి కరోనా ఓ ఆదాయ వనరు!

కష్టపెట్టిన వైరస్‌తోనే ఆదాయం పొందుతున్న కెన్యా క్షురకులు

కిబెరా: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని దేశాలు భారీ సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. అయినా అనేక మంది పనులు, వ్యాపారాలు లేక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న కరోనా వైరస్‌నే కెన్యాలోని క్షురకులు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. అదెలా అనుకుంటున్నారా? అయితే చదవండి.

ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో క్షౌరశాలలకు ప్రజల రాక తగ్గిపోయింది. దీంతో కిబెరా ప్రాంతానికి చెందిన క్షురకులు వినూత్న ఆలోచన చేశారు. కరోనా వైరస్‌ ఆకృతినే స్ఫూర్తిగా తీసుకొని కరోనాకు ఉండే కొమ్ములు మాదిరిగా జుట్టును ముళ్లు వేసి కట్టి కొత్త హెయిర్‌స్టైల్‌ను రూపొందించారు. ఇది దేశవ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయింది. ముందే ఆఫ్రికా వాసులు జుట్టును ముళ్లు ముళ్లుగా వేసి చిత్రవిచిత్రంగా హెయిర్‌స్టైల్‌ చేస్తుంటారు. ఇప్పుడు కరోనా కొమ్ముల స్టైల్‌ వారికి తెగ నచ్చేసింది. ఈ హెయిర్‌స్టైల్‌ ధర కూడా అన్నింటికి కంటే తక్కువగా ఉండటంతో ప్రజలు సెలూన్‌ల వద్ద క్యూ కట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని