కేరళ ఏనుగు మృతి: ఎఫ్‌ఐఆర్‌ నమోదు

తాజా వార్తలు

Updated : 04/06/2020 07:58 IST

కేరళ ఏనుగు మృతి: ఎఫ్‌ఐఆర్‌ నమోదు

తిరువనంతపురం: కేరళలో పేలుడు పదార్థాలు నింపిన పండు తినడం వల్ల ఏనుగు మృత్యువాతపడ్డ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. దీనిపై అటవీశాఖ అధికారులతో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనకు సబంధించి స్థానిక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారని మల్లప్పురం అటవీశాఖ అధికారి తెలిపారు.  

కొద్ది రోజుల క్రితం కేరళలోని మలప్పురం జిల్లాలోని సైలెంట్ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోకి గర్భంతో ఉన్న ఒక ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. అయితే అక్కడి గ్రామస్థులు దానికి పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను అందించారు. దాన్ని తిన్న ఏనుగు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రముఖలు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేశారు.  Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని