బాధితులను వెనక్కి పంపొద్దు: కేజ్రీవాల్

తాజా వార్తలు

Updated : 06/06/2020 23:09 IST

బాధితులను వెనక్కి పంపొద్దు: కేజ్రీవాల్

బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు

దిల్లీ: కరోనా వైరస్‌తో తీవ్రంగా ఇబ్బందికి గురవుతోన్న బాధితులకు ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. పడకలు అందుబాటులో ఉంచుకొని, బాధితులను వెనక్కి పంపివేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రులు వ్యవహరిస్తోన్న తీరుపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘కొన్ని ఆసుపత్రులు కొవిడ్ -19 బాధితులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. వేరే పార్టీల్లో ఉన్న కొందరు నాయకుల అండ చూసుకొని పడకల విషయంలో బ్లాక్‌ మార్కెట్‌ చేయగలమని భావించేవారిని హెచ్చరిస్తున్నా. అలాంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవు. ఈ అంశంపై దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకోడానికి మాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి’ అని కేజ్రీవాల్ అన్నారు. ఏదేమైనా, లక్షణాలు కనిపించని వ్యక్తులు కరోనా నిర్ధారణ పరీక్షలు కోసం పెద్ద సంఖ్యలో వస్తే, దేశ రాజధానిలో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లక్షణాలు కనిపించేవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.   

కాగా, కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, పరీక్షలు చేయడానికి, చేర్చుకోడానికి నిరాకరించడంతో చాలా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని కొందరు ట్వీట్ చేశారు. దానికి కేజ్రీవాల్ సమాధానమిస్తూ..‘బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడానికి మేం యాప్‌ను లాంచ్‌ చేశాం. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, పడకల గురించి సమాచారం పారదర్శకంగా ఉంచాలని భావించాం. మేము ఏదో నేరం చేసినట్లుగా గొడవ చేస్తున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రులు వెంటనే సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని