దిల్లీలో లక్ష దాటనున్న కేసులు!

తాజా వార్తలు

Published : 07/06/2020 12:09 IST

దిల్లీలో లక్ష దాటనున్న కేసులు!

ప్రభుత్వ నిపుణుల కమిటీ నివేదిక..

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి కాటుకు దిల్లీ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా 1320 పాజిటివ్‌ కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,654కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 761మంది మృత్యువాతపడ్డారు. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ కేసుల సంఖ్య జూన్‌ చివరినాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీవ్రతను అంచనా వేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై ఐదుగురు వైద్య నిపుణలుతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

దిల్లీలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రస్తుతం ఉన్న వైద్య పడకలకు అదనంగా మరో 15వేల పడకలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా, జులై 15నాటికి దాదాపు 42వేల పడకలు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేసినట్లు ప్రభుత్వం నియమించిన కమిటీకి నేతృత్వం వహించిన డా.మహేష్‌ వర్మ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ పదిహేను వేల పడకలను వివిధ హోటళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించామని, వీటిలో తప్పనిసరిగా ఆక్సిజన్‌ సదుపాయం ఉండేట్లు చూడాలని ప్రభుత్వానికి నివేదించినట్లు మహేష్‌ వర్మ పేర్కొన్నారు.

ప్రభుత్వం Vs వైద్య సంఘాలు
కొవిడ్‌ విజృంభణతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమయంలో కరోనా కేసులు, నిర్ధారణ పరీక్షల్లో ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా కరోనా సోకిన వారిని చేర్చుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులు వ్యతిరేకిస్తూ కృత్రిమంగా పడకల కొరత సృష్టిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఇలా ప్రవర్తించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా ఇలాంటి ఆరోపణలతో నగరంలోని సర్‌ గంగారాం ఆసుపత్రిపై కేసు కూడా నమోదు చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వైద్యులను, ఆసుపత్రులను బెదిరిస్తున్నారంటూ వైద్య సంఘాలు ఆరోపించాయి. ఈ సమయంలో గంగారాం ఆసుపత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ఖండిస్తూ దిల్లీ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. విపత్కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులను హెచ్చరించడం సరికాదని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని