జేకేలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

తాజా వార్తలు

Updated : 23/06/2020 12:06 IST

జేకేలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను అమరుడైయ్యారు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్‌, 182 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు కూడా షూటింగ్‌ ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్‌ మృతిచెందారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. అక్కడ కొన్ని తుపాకులతో పాటు బులెట్లు, మందుగుండు సామాగ్రి దొరికినట్లు ఆయన తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని