మహారాష్ట్రలో కరోనా.. లక్షకు పైనే రికవరీ!

తాజా వార్తలు

Published : 03/07/2020 01:05 IST

మహారాష్ట్రలో కరోనా.. లక్షకు పైనే రికవరీ!

ముంబయి: మహారాష్ట్రలో ఓ వైపు కరోనా విలయం కొనసాగుతుంటే.. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యా పెరగడం ఉపశమనం కలిగిస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదువుతున్న మహారాష్ట్రలో గత 24గంటల్లో 6330 కేసులు, 125 మరణాలు నమోదు కాగా.. 8081మంది కోలుకున్నారు. తాజాగా వచ్చిన కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,626కి చేరగా మరణాల సంఖ్య 8178గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 77260 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 54.21%గా ఉంది.

ముంబయిలో 80వేలు దాటాయ్‌..
దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిని కొవిడ్‌ మహమ్మారి వణికిస్తోంది. తాజాగా 1554 కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 80699గా ఉండగా.. 4689మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో 50691మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 25311గా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని