పుల్వామాలో పేలుడు..గాయపడ్డ జవాన్‌

తాజా వార్తలు

Published : 05/07/2020 10:54 IST

పుల్వామాలో పేలుడు..గాయపడ్డ జవాన్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామా జిల్లా గుంగూ ప్రాంతంలో ఐఈడీని పేల్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్‌ జవాన్‌ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నాలుగురోజుల వ్యవధిలో సీర్పీఎఫ్‌ బలగాలే లక్ష్యంగా జరిగిన రెండో దాడి ఇది. బుధవారం ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ సహా ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని