పుల్వామాలో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం

తాజా వార్తలు

Published : 07/07/2020 13:16 IST

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూ-క‌శ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ  ప్రాంతంలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.  అలాగే పోలీసు సహా ఇద్దరు సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదులు దాగి ఉన్నా‌రన్న స‌మాచారంతో పోలీసులు, భద్రతా దళాలతో కలిసి గుసూ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బలగాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులు జ‌రిపారు. ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలిపారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా తీవ్రంగా గాయపడి ఉంటారని భావిస్తున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని