కేరళ బంగారం కేసు ఎన్‌ఐఏకి

తాజా వార్తలు

Published : 10/07/2020 01:15 IST

కేరళ బంగారం కేసు ఎన్‌ఐఏకి

తిరువనంతపురం: కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వ్యవస్థీకృత అక్రమ రవాణాల వల్ల జాతీయ భద్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్‌లో రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న యూఏఈ కార్యాలయ ఉద్యోగితోపాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలోని మహిళా ఉద్యోగిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయన్ను పదవి నుంచి తొలగించారు.

ఈ వ్యవహారం కేరళలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలకు దీంతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. దౌత్య కార్యాలయ ప్యాకేజీకి, సీఎం కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పూర్తి దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు దిల్లీలోని యూఏఈ రాయబార కార్యలయం కూడా దీనిపై స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిందితులు కార్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని