కరోనా మరణాలు తగ్గిస్తున్న బీసీజీ!

తాజా వార్తలు

Updated : 10/07/2020 16:17 IST

కరోనా మరణాలు తగ్గిస్తున్న బీసీజీ!

ముంబయి: కరోనా వైరస్‌ మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్‌‌ కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే బీసీజీ వ్యాక్సినేషన్‌‌ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించాయి.

అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్‌లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని అధ్యయనం ద్వారా తెలిసింది. ‘ఇది నిజంగా ఆశ్చర్యమే. అమెరికాతో పోలిస్తే లాటిన్‌ అమెరికా దేశాల్లో జన సాంధ్రత ఎంతో ఎక్కువ’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న కరోలినా బరిల్లాస్‌ అన్నారు.

ఐరోపాలోని జర్మనీలోనూ ఫలితాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. తూర్పు జర్మనీతో పోలిస్తే పశ్చిమ జర్మనీలో కొవిడ్‌-19 మరణాల రేటు 2.9% ఎక్కువగా ఉంది. అదే ఫిన్లాండ్‌తో పోలిస్తే ఇటలీలో మరణాల రేటు ఏకంగా 4 రెట్లు ఎక్కువ. మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో వయసు, ఆదాయం, ఆరోగ్య సదుపాయాల పరంగా తేడాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ ఉన్న ఉమ్మడి కారకం టీబీ వ్యాక్సినేషన్‌.

తూర్పు, పశ్చిమ జర్మనీలు 1990లో ఏకమయ్యాయి. పశ్చిమతో పోలిస్తే తూర్పు జర్మనీలో పదేళ్లు ముందుగానే టీబీ వ్యాక్సినేషన్‌ జరిగింది. దాంతో పశ్చిమ జర్మనీలో వృద్ధులకు కరోనాతో ఎక్కువ ముప్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో 10% టీబీ వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ ఉంటే కొవిడ్‌ మరణాల్లో అక్కడ 10% తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తానికి బీసీజీ ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని