గ్యాంగ్‌స్టర్‌ పాత్రపై దర్యాప్తు..

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:52 IST

గ్యాంగ్‌స్టర్‌ పాత్రపై దర్యాప్తు..

ముంబయి: పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో స్కార్పియోను ఉంచిన కేసులో.. తిహార్‌ జైల్లోని ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబయి అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ కొన్ని రోజులుగా దిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటివద్ద వాహనాన్ని గుర్తించినప్పుడు కూడా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఆ సమయంలో ముంబయి నుంచి కొందరు వ్యక్తులు అతనితో మాట్లాడారు. గ్యాంగ్‌స్టర్‌ ద్వారా తిహార్‌ జైల్లోని ఉగ్రవాదులకు ఈ స్కార్పియో ఘటన సమాచారం అందింది. ఆ తర్వాతే జైలులో టెలిగ్రామ్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. పేలుడు పదార్ధాలతో స్కార్పియోను ఉంచింది తామే అని జైష్‌-ఉల్‌-హింద్‌ ఉగ్రసంస్థ పేరిట అందులో మెసేజ్‌ చేయగా వైరల్‌ అయింది. మొత్తం ఈ ఉదంతంలో ఉగ్ర సంస్థ ప్రమేయం ఉందని భ్రమలు సృష్టించి, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ఇలా చేసినట్టు ముంబయి ఏటీసీ పోలీసువర్గాలు తెలిపాయి. అయితే ఘటన జరిగిన రోజు ఆస్పత్రిలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో ముంబయి నుంచి మాట్లాడింది ఎవరన్నది తేలాల్సి ఉంది.

ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం

ఇదే కేసులో ఎన్‌ఐఏ సైతం దర్యాప్తును ముమ్మరం చేసింది. అంబానీ నివాసం సమీపంలోని హాటల్‌లో నడుస్తున్న క్లబ్‌లో శుక్రవారం సోదాలు జరిపింది. క్లబ్‌ యజమాని వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని