China: చైనాలో వర్ష బీభత్సం.. 21 మంది మృతి

తాజా వార్తలు

Published : 14/08/2021 11:46 IST

China: చైనాలో వర్ష బీభత్సం.. 21 మంది మృతి

బీజింగ్, అంకారా: చైనాలోని హుబెయ్‌ ప్రావిన్సులో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురి ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. సుయిషియన్‌ కౌంటీలోని లియులిన్‌ టౌన్‌షిప్‌లో బుధవారం నుంచి గురువారం మధ్య 503 మి.మీ. వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. దీంతో సుమారు 8 వేల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

టర్కీ వరదల్లో 38 మంది.. 

ఉత్తర టర్కీలో ముంచెత్తుతున్న వరదల కారణంగా మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందాలు గురువారం రాత్రి వారి మృతదేహాలను కనుగొన్నాయి. దీంతో మృతుల సంఖ్య 38కి చేరింది. పదుల సంఖ్యలో గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వారిలో 12 ఏళ్ల కవల సోదరీమణులు, వారి తాత, నానమ్మ ఉన్నట్లు చెప్పారు.    
శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియల కల్లోలం కొనసాగుతూనే ఉంది. లాహౌల్‌ - స్పితి జిల్లా నలదా గ్రామ సమీపంలోని చంద్రభాగ నదిలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.  కిన్నౌర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై బుధవారం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 17కు చేరింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని