Afghan Crisis: ‘ఐసిస్‌-కే’లో 14 మంది కేరళవాసులు

తాజా వార్తలు

Published : 29/08/2021 15:31 IST

Afghan Crisis: ‘ఐసిస్‌-కే’లో 14 మంది కేరళవాసులు

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌-కే ఉగ్రసంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడి.. 180 మందికిపైగా ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ముష్కర మూక దెబ్బకు.. కాబుల్‌లో నిత్యం ఏం జరుగుతుందోనని యావత్‌ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఐసిస్‌-కే ఉగ్రముఠాలో 14 మంది కేరళకు చెందిన వారు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలు జైళ్లలోని ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. బగ్రామ్‌ జైలు నుంచి విడుదల చేసిన తర్వాత వారంతా ఐసిస్‌-కే సంస్థతో కలిసినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు కేరళలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ సిరియాగా చెప్పుకునే ఈ ఉగ్ర సంస్థ 2014లో ఇరాక్‌లోని మోసుల్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత కేరళలోని మలప్పురమ్, కాసరగాడ్, కన్నూర్‌ జిల్లాల నుంచి కొన్ని బృందాలు భారత్‌ నుంచి వెళ్లి పశ్చిమాసియాలోని జిహాదీలతో కలిసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులోని కొన్ని కుటుంబాలు అఫ్గానిస్థాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్స్‌కు వచ్చి ఐసిస్‌-కేలో చేరినట్లు తెలిసింది. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన కేరళవాసులతో అఫ్గాన్‌లో దాడులు చేపట్టి భారత్‌ పేరును తాలిబన్లు, ఇతర ముఠాలు నాశనం చేసే అవకాశం ఉందని భారత్‌ ఆందోళన చెందుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని