గత జన్మ గుర్తొచ్చింది.. సెలవు కావాలి..

తాజా వార్తలు

Published : 12/10/2021 13:38 IST

గత జన్మ గుర్తొచ్చింది.. సెలవు కావాలి..

మధ్యప్రదేశ్‌లో ఓ సబ్‌ ఇంజినీర్‌ వింత కారణాలతో ప్రతి ఆదివారం ‘డే ఆఫ్‌’ కావాలని తన పైఅధికారులను అభ్యర్థించారు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?  అగర్‌ మాల్వా జిల్లాలోని సంశేర్‌ జనపద్‌ పంచాయతీ చీఫ్‌కు.. సబ్‌ ఇంజినీర్‌ రాజ్‌కుమార్‌ యాదవ్‌ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు సెలవు కావాలని అందులో కోరారు. ‘‘నా గత జన్మలో ప్రస్తుత ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ.. పాండవుల్లో ఒకరైన నకులుడు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. అదే సమయంలో ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ శకుని. నా గత జన్మ గురించి తెలిశాక.. ఇకపై నేను నా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలనుకుంటున్నాను’’ అని రాజ్‌కుమార్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్‌కుమార్‌ రాసిన ఈ లేఖ.. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని