Corona Virus: సీజనల్‌ వ్యాధిలా కరోనా

తాజా వార్తలు

Published : 27/10/2021 10:40 IST

Corona Virus: సీజనల్‌ వ్యాధిలా కరోనా

లండన్‌: ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు వచ్చే సీజనల్‌ ఇన్‌ఫెక్షన్‌గా కొవిడ్‌-19 మారి ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందుకు గట్టి ఆధారాలు లభిస్తున్నాయని చెప్పారు. ఇది చాలావరకూ సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజాలా రూపాంతరం చెంది ఉండొచ్చని తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోందన్న వాదనను ఇది సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో పరిసరాల్లోని గాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. శాస్త్రవేత్తలు మొదట నిర్వహించిన సైద్ధాంతిక నమూనా అధ్యయనంలో.. కొవిడ్‌ వ్యాప్తిలో వాతావరణం ఒక కారకం కాదని వెల్లడైంది. అయితే ఈ మహమ్మారి చైనాలో తొలుత ఉత్పన్నమైన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. అది 30, 50 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నట్లు గుర్తించారు. అక్కడ గాల్లో తేమ చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. అలాగే ఉష్ణోగ్రత కూడా 5 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 162 దేశాల్లో కొవిడ్‌ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు, తేమ చూపిన ప్రభావాన్ని పరిశీలించారు. ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రెండు పరామితులు పెరిగినప్పుడు కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వేసవిలో మాత్రం ఈ పోకడ విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. ఆ కాలంలో యువత ఎక్కువగా గుమికూడటం, పర్యాటకులు పెరగడం, ఏసీల వినియోగం వంటివి ఇందుకు దోహదపడి ఉండొచ్చన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని