Corona: సమర్థ రక్షణ కల్పించే నేసల్‌ స్ర్పే

తాజా వార్తలు

Updated : 13/07/2021 10:52 IST

Corona: సమర్థ రక్షణ కల్పించే నేసల్‌ స్ర్పే

వాషింగ్టన్‌: ముక్కు ద్వారా వేసే కరోనా టీకా సమర్థంగా పనిచేస్తుందని జంతువులపై జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ తరహా వ్యాక్సిన్‌ ఒక డోసు ఇస్తే సరిపోతుందని తేలింది. అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్రస్తుతం కరోనా టీకాలను ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తున్నారు. అయితే ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ తరహాలో కొవిడ్‌ టీకాలనూ నేసల్‌ స్ప్రే రూపంలో ఇవ్వవచ్చని పరిశోధకులు తెలిపారు. ‘‘ప్రస్తుత కరోనా టీకాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే ప్రపంచ జనాభాలో అధికశాతం మంది ఇంకా వ్యాక్సిన్‌ పొందలేదు. అందువల్ల మరిన్ని టీకాల అవసరం ఉంది. అవి సులువుగా ఉపయోగించగలిగేలా ఉండటంతోపాటు ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవాలి. వ్యాధి వ్యాప్తిని సమర్థంగా నిలువరించగలగాలి’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పాల్‌ మెక్‌ క్రే చెప్పారు. ప్రయోగాత్మక టీకాలో పారాఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ 5 (పీఐవీ5)ను ఉపయోగించారు. దానిలోకి కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ను ప్రవేశపెట్టారు. ఇది కొవిడ్‌ నుంచి రక్షించేలా రోగ నిరోధక వ్యవస్థలో ప్రతిస్పందనలను కలిగించింది. పీఐవీ5 అనేది సాధారణ జలుబు వైరస్‌. ఇది మానవులు, ఇతర క్షీరదాల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది. ఈ తరహా టీకా మెర్స్‌ ఇన్‌ఫెక్షన్‌కూ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నాసిక మార్గంలోని మ్యుకోసల్‌ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది. కరోనా ఇన్‌ఫెక్షన్లకు ప్రారంభ స్థానం ఇదే.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని