తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చినా.. కన్నవారే పొట్టన బెట్టుకున్నారు 

తాజా వార్తలు

Published : 13/08/2021 08:32 IST

తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చినా.. కన్నవారే పొట్టన బెట్టుకున్నారు 

మధ్యప్రదేశ్‌లో పరువు హత్య

గ్వాలియర్‌: ప్రేమ మోజులో వేరే వర్గం వ్యక్తితో వెళ్లిన యువతి.. తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికొచ్చింది. ఆదరించాల్సిన కన్నవారే ఆమెను పరువు పేరిట పొట్టనబెట్టుకున్నారు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 2న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్‌ నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి జూన్‌ 5న వేరే వర్గం వ్యక్తితో కలిసి పారిపోయింది. రెండు రోజులకు తిరిగొచ్చిన ఆమెను పోలీసులు మహిళా సంరక్షణ గృహానికి తరలించారు. ఆ తర్వాత కన్నవాళ్లతోనే ఉంటాననడంతో జులై 31న ఇంటికి పంపారు. ఆగస్టు 2న ఆమెను కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు, బంధువులే కడతేర్చారు. తన కుమార్తె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ అదే రోజు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు తాజాగా ఫోరెన్సిక్‌ నివేదికతో హత్య అని తేటతెల్లమైంది. తండ్రి, సోదరుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని