Crime News: ‘వీర్యం’ సిరంజీతో మహిళలపై దాడి

తాజా వార్తలు

Updated : 10/09/2021 07:29 IST

Crime News: ‘వీర్యం’ సిరంజీతో మహిళలపై దాడి

అమెరికాలో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష

వీర్యం నింపిన సిరంజీతో ఓ మహిళను పొడిచినందుకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒహాయోకు చెందిన థామస్‌ స్టీమెన్‌(52)కు తొలుత 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం తర్వాత పదేళ్లకు కుదించింది. కిరాణా దుకాణంలోకి వచ్చిన మహిళకు స్టీమెన్‌ వెనక నుంచి సిరంజీని గుచ్చాడు. ఈ ఘటన 2020 ఫిబ్రవరిలో జరిగింది. తొలుత ఏదో కుట్టిందని భావించిన మహిళ.. నిందితుడిని ఆరా తీసింది. సిగరెట్‌తో కాల్చావా అని ప్రశ్నించింది. దానికి అవునని చెబుతూనే.. అది పురుగు కుట్టినట్టు ఉంటుందని నిందితుడు మహిళతో అన్నాడని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. సిరంజీతో దాడి చేశాడని, అందులో వీర్యం కలిపాడని తర్వాత తేలింది. థామస్‌ స్టీమెన్‌ మరో ఇద్దరు బాధితులపైనా సిరంజీ దాడికి యత్నించాడు. తన ముందు నడవమని సూచిస్తూ 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్టీమెన్‌ ఇంటిని తనిఖీ చేయగా.. ద్రవంతో కూడిన ఓ సిరంజీని గుర్తించారు. 9 ఖాళీ సిరంజీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఐదు సిరంజీలకు సూదులు లేవు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని