Madras high court: తమిళం దేవుళ్ల భాషే

తాజా వార్తలు

Updated : 14/09/2021 09:44 IST

Madras high court: తమిళం దేవుళ్ల భాషే

 ప్రజలు మాట్లాడే ప్రతి భాషా దైవ భాషే: మద్రాస్‌ హైకోర్టు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళం దేవుళ్ల భాష అని.. ప్రజలు మాట్లాడే ప్రతి భాషా దేవుళ్ల భాషేనని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులోని కరూర్‌ జిల్లాలోని దేవాలయంలో పూజలు, ఇతర కార్యక్రమాలు తమిళంలో జరిపేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ మద్రాస్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు.. దేశంలో సంస్కృతం మాత్రమే దేవుళ్ల భాష అని.. ఆ భాషలో ప్రార్థనలు చేస్తే మాత్రమే దేవుడికి చేరతాయనే విధంగా ప్రచారం కల్పించారని అన్నారు. తమిళం కూడా దేవుళ్ల భాషేనని చెప్పారు. శివుడు నృత్యం చేస్తుండగా జారి పడిన ఢమరుకం శబ్దం నుంచి తమిళం పుట్టిందని నమ్ముతారని పేర్కొన్నారు.  దేవుడికి ఒక భాషే అర్థమవుతుందని నమ్మడానికి వీల్లేదన్నారు. అళ్వార్లు తమిళాన్ని అభివృద్ధి చేశారని.. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్గశిర మాసంలో ‘తిరుప్పావై’ చదువుతారని పేర్కొన్నారు. పిటిషనర్‌ ఒక దేవాలయానికి సంబంధించి కోరారని.. కానీ దేశవ్యాప్తంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని