ఆమె గుండె కుడివైపున ఉంది!

తాజా వార్తలు

Published : 22/07/2021 01:19 IST

ఆమె గుండె కుడివైపున ఉంది!


(Photo: insta/clairemack04 )

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని ఓ సినీ కవి అన్నారు. అయితే, ఓ యువతికి మాత్రం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉందట. పుట్టిన 19ఏళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో ఆమె షాక్‌ నుంచి తేరుకోవట్లేదు. అమెరికాలోని చికాగోకి చెందిన క్లెయిర్‌ మాక్‌ గత రెండు నెలల నుంచి దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గకపోవడంతో గత నెలలో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్లు గుర్తించాడు. అయితే, చికిత్సలో భాగంగా ముందుగా ఎక్స్‌ రే తీయాలని నిర్ణయించారు. అలా తీసిన ఎక్స్‌ రేతో గుండె కుడివైపు ఉన్న విషయం బయటపడింది. ఇదే విషయాన్ని క్లెయిర్‌కు చెప్పడం ఆమె విస్మయానికి గురైంది. ఇలా గుండె ఎడమవైపునకు కాకుండా కుడివైపు ఉంటే డెక్స్‌ట్రాకార్డియా అంటారని, ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువ మందిలో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని క్లెయిర్‌ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లలో కొందరు ఆమెపై జోకులు వేస్తుంటే.. మరికొందరు జాగ్రత్తగా ఉండండని సూచనలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని