ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా 2,84,196 కేసులు!

తాజా వార్తలు

Updated : 25/07/2020 09:41 IST

ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా 2,84,196 కేసులు!

దక్షిణకొరియాలో మార్చి తర్వాత అత్యధిక కేసుల నమోదు

ఇంటర్నెట్ డస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం-శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,84,196 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. వీటిలో సగానికి పైగా కేసులు అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లోనే రికార్డు కావడం గమనార్హం. 

* అమెరికాలో కొవిడ్‌ బారిన పడి శుక్రవారం కొత్తగా 1000 మందికి పైగా మరణించారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 1,48,490కి చేరింది. కొత్తగా దాదాపు 80 వేల కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 42,48,327కి పెరిగింది. 

* దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య మార్చి తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో పెరిగాయి. శుక్రవారం కొత్తగా 113 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 14,092కు చేరింది. కొత్త కేసుల్లో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి ఆరోగ్యం శాఖ వెల్లడించింది. వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసిన అతికొన్ని దేశాల్లో దక్షిణకొరియా ఒకటి. 

* ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 23,43,366కు చేరింది. ఇక మహమ్మారి మరో 1,156 మందిని బలిగొనడంతో మరణాల సంఖ్య 85,238కు పెరిగింది. 

* మెక్సికోలో 7,573 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే మరో 737 మంది మరణించారు. దీంతో బాధితుల సంఖ్య 3,78,285కు, మృతుల సంఖ్య 42,645కు పెరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని