మెక్సికోలో కాల్పులు.. 13 మంది మృతి

తాజా వార్తలు

Updated : 19/03/2021 15:40 IST

మెక్సికోలో కాల్పులు.. 13 మంది మృతి

మెక్సికో: మెక్సికో నగరంలో ఓ క్రిమినల్‌ గ్యాంగ్ పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 13 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. సెంట్రల్‌ మెక్సికోలో గురువారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసు వాహన శ్రేణి లక్ష్యంగా ఓ మాదకద్రవ్యాల ముఠా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడింది. ఈ దాడిలో 8 మంది పోలీసులు, ఐదుగురు ప్రాసిక్యూషన్‌ ఇన్వెస్టిగేటర్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజా భద్రతా విభాగాధిపతి రోడ్రిగో మార్ట్నెజ్ సెలిస్ మాట్లాడుతూ.. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సైనికులు, నేషనల్ గార్డ్ దళాలు మెక్సికో నగరవ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. నిందితులకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని