రికవరీ@21 రోజుల్లో 100% పెరుగుదల

తాజా వార్తలు

Published : 23/08/2020 02:32 IST

రికవరీ@21 రోజుల్లో 100% పెరుగుదల

దిల్లీ : టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. 

తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

మరోవైపు గత 21 రోజుల్లో కోలుకుంటున్న వారి సంఖ్య వంద శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్‌లో తెలిపింది. ఈ నెల 1 నాటికి కోలుకున్న వారి సంఖ్య 10,94,374గా ఉండగా.. 10 నాటికి 15 లక్షలు దాటింది. 21 నాటికి ఆ సంఖ్య 21,58,946కి చేరింది. తాజాగా మరో 63 వేల మంది కోలుకోగా ఆ సంఖ్య 22 లక్షలు దాటింది. దీంతో రికవరీ రేటు భారత్‌లో 74.69 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.87కి తగ్గింది. ప్రస్తుతం నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు నాలుగో వంతు కంటే తక్కువగా(23.43 శాతం) ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని