Nitin Gadkari: యూట్యూబ్‌తో ప్రతి నెలా నాకు ₹4లక్షలు.. ఎందుకంటే?

తాజా వార్తలు

Updated : 18/09/2021 15:23 IST

Nitin Gadkari: యూట్యూబ్‌తో ప్రతి నెలా నాకు ₹4లక్షలు.. ఎందుకంటే?

భరూచ్‌: యూట్యూబ్‌ తనకు ప్రతి నెలా ₹4లక్షలు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లోనే ఉండి లక్షల రూపాయాలు ఆర్జించానన్నారు. గుజరాత్‌లోని భరూచ్‌లో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిపై సమీక్షించిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లో ఉంటూ రెండు రకాల పనులు చేశానని తెలిపారు. చెఫ్‌గా మారి ఇంట్లో వంట చేశానని, అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాన్యాసాలు ఇచ్చినట్టు చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తదితరులకు ఆన్‌లైన్‌లో దాదాపు 950కి పైగా ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలిపారు. వాటన్నింటినీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశానన్నారు. దీంతో తన యూట్యూబ్‌ ఛానల్‌కు వ్యూస్‌ పెరగడంతో ఆ సంస్థ ఇప్పుడు తనకు నెలకు రూ.4లక్షలు చొప్పున రాయల్టీగా చెల్లిస్తోందని వివరించారు. మరోవైపు, రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు తమ మంత్రిత్వశాఖ రేటింగ్‌ను ప్రారంభిస్తుందన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని