అధికారులను ఒంటెలపై ఊరేగించిన గ్రామస్థులు

తాజా వార్తలు

Published : 30/05/2021 01:37 IST

అధికారులను ఒంటెలపై ఊరేగించిన గ్రామస్థులు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి తమ గ్రామానికి విచ్చేసిన అధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికిన ఘటన మహారాష్ట్రలోని పాలీ జిల్లాలో జరిగింది. రాయ్‌పూర్‌ సబ్ డివిజన్ ప్రాంతంలోని పలు గ్రామాలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారీ సందర్శించనేలేదు. ఇందులో సత్రుంగియా అనే గ్రామం కూడా ఉంది. తమ గ్రామానికి ఓసారి రావాలని జిల్లా కలెక్టర్ అన్షదీప్, ఎస్పీ కల్‌రామ్ రావత్‌ను ఆ గ్రామస్థులు కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందిని వెంటబెట్టుకుని ఆ గ్రామానికి వెళ్లారు. తొలిసారి తమ ప్రాంతానికి తరలివస్తున్న అధికారులకు స్థానికులు విభిన్నంగా స్వాగతం పలికారు. ఒంటెలపై వారిని కూర్చోబెట్టి పూలవర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో  ఆకట్టుకుంటున్నాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని