ఆ రాష్ట్రంలో 80శాతం యూకే వేరియంట్‌‌ కేసులే!

తాజా వార్తలు

Updated : 07/04/2021 14:11 IST

ఆ రాష్ట్రంలో 80శాతం యూకే వేరియంట్‌‌ కేసులే!

చండీగఢ్‌: పంజాబ్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు భారీగా జరుగుతున్న వివాహ వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రైతుల ఆందోళనలే కారణమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ మీడియాతో వెల్లడించారు.

‘పంజాబ్‌లో నమోదవుతున్న కొత్త కరోనా వైరస్‌ కేసుల్లో 80శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయం జన్యుక్రమ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు భారీగా వివాహ వేడుకలు జరగడం, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడం, రైతుల చేస్తున్న ఆందోళనలే కారణం’ అని హర్షవర్దన్‌  తెలిపారు. మరోవైపు, దేశంలో మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసుల పెరుగుదల ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోందని కేంద్రం మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా మరణాలకు సంబంధించి పంజాబ్‌లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఆ రాష్ట్రం వాటా మూడు శాతం ఉంటోంది. అదేవిధంగా మరణాల్లో 4.5శాతం నమోదవుతోంది’ అని తెలిపారు. పంజాబ్‌లో గడిచిన 24 గంటల్లో 61 మంది కరోనాతో మరణించారు. మరో 2,905 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని