97 శాతానికి చేరిన కరోనారికవరీ రేటు

తాజా వార్తలు

Published : 14/02/2021 10:14 IST

97 శాతానికి చేరిన కరోనారికవరీ రేటు

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో  6,97,114 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,194 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కి చేరింది. కొత్తగా 11,106 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,06,11,731కు చేరి.. రికవరీ రేటు 97.31శాతంగా కొనసాగుతోంది.

ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,55,642కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,37,567 తగ్గింది. ఇక మరణాల రేటు 1.43 శాతంగా కొనసాగుతోంది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 82లక్షలు దాటింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

గట్టెక్కిన ట్రంప్‌


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని