Corona: 95 శాతానికి చేరిన రికవరీ రేటు
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 95 శాతానికి చేరిన రికవరీ రేటు

  4వ రోజూ లక్షకు దిగువనే కొత్త కేసులు..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. అలాగే 29 రోజులుగా రోజువారీ కేసుల కంటే రికవరీలే అధికంగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ప్రభుత్వాలు విధించిన వైరస్‌ కట్టడి ఆంక్షలు ఫలితాన్నిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది.

తాజాగా 20,44,131 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 91,702 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు కొద్దిమేర తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,74,823 చేరింది. తాజాగా మరోసారి 3వేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న 3,403 మంది మృత్యు ఒడికి చేరుకోగా.. మొత్తం మరణాలు 3.6లక్షలకు పైబడ్డాయి. మహారాష్ట్ర మరణాల లెక్కను సవరించడంతో నిన్న ఈ పెరుగుదల కనిపించింది. ఆ రాష్ట్రంలో 1,915 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. క్రితం రోజు బిహార్ కూడా ఈ లెక్కను సవరించడంతో.. రికార్డు స్థాయిలో 6వేలకు పైగా మరణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఇక దేశంలో క్రియాశీల రేటు 4 శాతం దిగువకు చేరగా.. రికవరీ రేటు 95 శాతానికి చేరువైంది. నిన్న ఒక్కరోజే 1,34,580 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రెండుకోట్ల 70 లక్షల మందికిపైగా వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 11 లక్షల మందికిపైగా కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 32,74,672 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 24,60,85,649కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని