Vaccination: ‘భారత్‌లో 90 కోట్లు దాటిన డోసులు.. ‘జై అనుసంధాన్‌’ ఫలితమే’

తాజా వార్తలు

Published : 03/10/2021 01:18 IST

Vaccination: ‘భారత్‌లో 90 కోట్లు దాటిన డోసులు.. ‘జై అనుసంధాన్‌’ ఫలితమే’

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దూసుకెళ్తున్న భారత్‌.. ఈ క్రమంలో వరుస రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారానికి దేశంలో మొత్తం డోసుల పంపిణీ 90 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారత్‌లో కరోనా డోసుల పంపిణీ మొత్తం 90 కోట్లు దాటింది. లాల్‌బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌ - జై కిసాన్‌’ నినాదం ఇచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ‘జై విజ్ఞాన్‌’ అని అన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ‘జై అనుసంధాన్‌’ అని పిలుపునిచ్చారు. దాని ఫలితమే ఈ భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం’ అని రాసుకొచ్చారు.

‘88.14 కోట్ల డోసులు సరఫరా చేశాం’

మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 88.14 కోట్ల డోసులు ఉచితంగా, డైరెక్ట్‌ స్టేట్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కేటగిరీలో సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వాటి వద్ద ఇంకా 5.28 కోట్ల డోసుల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. పెద్ద మొత్తంలో టీకాల లభ్యత, సరైన ప్రణాళికల ద్వారా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే విషయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 69 శాతం మందికి కనీసం ఒక డోసు టీకా అందించినట్లు కేంద్రం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 25 శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్లు చెప్పింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని