8 నుంచి యూకేకు విమాన సర్వీసులు

తాజా వార్తలు

Updated : 07/01/2021 16:33 IST

8 నుంచి యూకేకు విమాన సర్వీసులు

దిల్లీ: కొత్త కరోనా వైరస్‌తో అల్లాడుతున్న యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ వెల్లడించారు. జనవరి 23 వరకు వారానికి 15 విమానాలే ఇరు దేశాల మధ్య సేవలందించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఈ విమాన సర్వీసులు దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల నుంచి యూకేకు సేవలందిస్తాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీసీఏ ప్రకటిస్తుందని తెలిపారు. 

మరోవైపు, అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసిన మార్గాల్లో పరిస్థితిని బట్టి డీజీసీఏ అనుమతిస్తుందని పేర్కొంది. అలాగే, బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్‌ నేపథ్యంలో డిసెంబర్‌ 22 నుంచి 31 వరకు గతంలో తాత్కాలిక నిషేధం విధించిన భారత్‌.. దాన్ని మరో వారం పాటు (జనవరి 7వరకు) పొడిగిస్తూ డిసెంబర్‌ 30న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

కొవిడ్‌ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని