22 ప్రాంతీయ సర్వీసులను ప్రకటించిన ఇండిగో

తాజా వార్తలు

Updated : 12/02/2021 05:14 IST

22 ప్రాంతీయ సర్వీసులను ప్రకటించిన ఇండిగో

ముంబయి: దేశంలో ప్రాంతీయ అనుసంధానం పెంచేందుకు కొత్తగా 22 సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో గురువారం ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ సేవలు మొదలవుతాయని ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సర్వీసులు రాజమహేంద్ర వరం-తిరుపతి, భువనేశ్వర్‌-పట్నా, చెన్నై-వడోదర, బెంగళూరు-షిర్డీ ఇంకా మరొకొన్ని ప్రాంతాలకు ఉన్నట్లు వెల్లడించారు.

‘‘ రీజినల్‌ కనెక్టివిటీ పథకం కింద దేశంలోని నాలుగు దిశల్లో 22 నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నాం. ఇది ప్రాంతీయ ప్రయాణాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాం. సంస్కృతులకు కేంద్రాలైన వివిధ ప్రాంతాలకు ప్రాంతీయ విమానాలను నడపడం ద్వారా పర్యటకమూ అభివృద్ది చెందుతుంది’’ అని ఇండిగో ప్రధాన వ్యూహ అధికారి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రయాణికులకు అనువైన ధరల్లో, సురక్షితమైన ప్రయాణ అనుభూతులను అందించేందుకు ఇండిగో ఎప్పుడూ ముందుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

కరోనా వేరియంట్లను ఎలా గుర్తిస్తారంటే..

మార్చి వరకూ 80శాతం విమానాలే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని