close

తాజా వార్తలు

Updated : 03/03/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు

ముంబయి: ముంబయిలో పలు సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. నటి తాప్సీ, నిర్మాత మధు మంతెన, దర్శకుడు వికాస్‌ బెహల్‌ నివాసాలు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు చెందిన ఫాంటమ్‌ ఫిల్మ్స్‌, టాలెంట్‌ హంట్‌ కంపెనీ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. ముంబయి, పుణెల్లో ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు అనుకూలంగా వీరు గతంలో ట్వీట్లు చేశారు. ఇదే విషయంపై మరో నటి కంగనా రనౌత్‌, తాప్సీ మధ్య ట్విటర్‌ వార్‌ జరిగిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని