కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య

తాజా వార్తలు

Published : 23/02/2021 12:32 IST

కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య

బ్రాజ్జవిల్లే: కాంగోలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఇటలీ రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో ఐరాస వాహన శ్రేణిలో వెళుతున్న రాయబారి లూకా అటాన్సియాపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. దాడి సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా లూకాతో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

సహజ వనరులు పుష్కలంగా ఉంగే కాంగో ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. కాగా శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుండగా, అది సహించని తిరుగుబాటు బృందాలు ప్రముఖులపై దాడికి తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ రాయబారిని హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని