చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్‌.. జపాన్‌ సంపన్నుడి ఆఫర్‌!

తాజా వార్తలు

Updated : 04/03/2021 12:28 IST

చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్‌.. జపాన్‌ సంపన్నుడి ఆఫర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడిపైకి మానవులు చేరే కాలం దగ్గర్లోనే ఉంది. ఇప్పటికే చంద్రుడిపై జీవించే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు సంస్థలు చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎలన్‌ మస్క్‌ స్థాపించిన స్పేస్‌ ఎక్స్‌ మానవ సహిత రాకెట్‌.. బిగ్‌ ఫాల్కెన్‌ను సిద్ధం చేసింది. 2023లో ఈ రాకెట్‌ చంద్రుడి వద్దకు వెళ్లనుందని 2018లోనే ప్రకటించింది. ఇందులో 10 నుంచి 12 మంది వెళ్లే వీలుంది. అయితే, అదే ఏడాది జపాన్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ రిటైల్‌ సంస్థ అధిపతి మేజావాకు తొలి సీటు కేటాయించినట్లు స్పేస్‌ ఎక్స్‌ వెల్లడించింది.

కాగా.. మేజావా తనతో పాటు మరో ఆరు నుంచి ఎనిమిది మందిని చంద్రుడిపైకి ఉచితంగా తీసుకెళ్తానని ప్రకటించాడు. ‘డియర్‌ మూన్‌’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పోటీ నిర్వహించి.. ఎంపికైన ఎనిమిది మందికి ప్రయాణం సహా ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని పేర్కొన్నాడు. గతంలోనే ఈ విషయాన్ని వెల్లడించినా.. ఇటీవల ప్రజల నుంచి దరఖాస్తులు కోరుతున్నాడు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి వ్యక్తిగత మెయిల్‌ పంపిస్తారట. అందులో ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన తర్వాత వారి ప్రయాణం.. చంద్రుడిపై అనుభవాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపర్చాల్సి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక కళ ఉంటుంది. ఆ కళను ఈ అనుభవం బయటకు తీస్తుందని మేజావా ఆశాభావం వ్యక్తం చేశాడు.

చంద్ర యాత్రను స్పేస్‌ ఎక్స్‌ సంస్థ 2023లో నిర్వహించనుంది. ఈ ‘డియర్‌ మూన్‌’ ప్రాజెక్టులో భాగంగా మనుషులు ఆరు రోజులపాటు చంద్రుడిపై ఉండనున్నారు. దీనికంటే ముందు ఇన్సిపిరేషన్‌-4 పేరుతో స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఈ ఏడాది చివర్లో  నలుగురురిని అంతరిక్షంలోకి పంపనుంది. మరోవైపు అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి కూడా సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం అంగారక గ్రహం వరకు వెళ్లడానికి వీలుగా ఎటువంటి రాకెట్‌ను రూపొందించాలనే విషయంపై పరిశోధనలు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని