మ్యాజిక్‌ ఫిగర్‌కి‌ చేరువలో బైడెన్‌

తాజా వార్తలు

Updated : 05/11/2020 10:31 IST

మ్యాజిక్‌ ఫిగర్‌కి‌ చేరువలో బైడెన్‌

కీలక రాష్ట్రం మిషిగన్‌లో గెలిచిన డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మిషిగన్‌(16)లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధానికి వైపుగా బైడెన్‌ అడగులు పడుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మిషిగన్‌ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ అక్కడి రాష్ట్ర కోర్టులో దావా వేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ ప్రచార బృందం దావాలో పేర్కొంది. 

72ఏళ్ల తర్వాత అరిజోనాలో డెమొక్రాట్లు..
ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత డెమొక్రాట్లకు అరిజోనా మద్దతు లభించింది. అరిజోనాలో ఉన్న 11ఎలక్టోరల్‌ ఓట్ల మద్దతు ఈసారి బైడెన్‌కే లభించింది. అంతేకాకుండా సెనేట్‌ స్థానాన్ని కూడా డెమొక్రాట్‌లకే కైవసం చేసుకున్నారు. 1952 సంవత్సరం నుంచి ఇక్కడ రిపబ్లికన్‌లే గెలుస్తూ వస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేసి ఆధిపత్యం చెలాయించిన రిపబ్లికన్లపై పైచేయి సాధించడంతో డెమొక్రాట్లు ఆనందంలో ఉన్నారు. ఇక్కడ గెలిచేందుకు గత దశబ్దం కాలంగా తీవ్ర ప్రయత్నం చేస్తోన్న డెమొక్రాట్‌లు చివరకు విజయం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని